హుదుద్ హార్రర్! తీరంలో ఉధృతి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 11, 2014

హుదుద్ హార్రర్! తీరంలో ఉధృతి!

As the cyclone 'Hudhud' is closing in on the Andhra Pradesh coastline and is expected to make a landfall near Visakhapatnam by Sunday afternoon, about 1.11 lakh people in five coastal districts have been shifted to safer places.
బంగాళాఖాతంలో ఏర్పడిన హుదుద్‌ తుపాను పెనుతుపానుగా మారి క్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తీరాన్ని సమీపిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది స్థిరంగా కొనసాగుతోంది. విశాఖకి తూర్పు - ఆగ్నేయ దిశలో 430, ఒడిశాలోని గోపాలపూర్‌కి దక్షిణ - ఆగ్నేయ దిశలో 460 కిలోమీటర్ల దూరంలో పెను తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరో 12 గంటల్లో తీవ్ర పెను తుపానుగా మారే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే వీలుంది. శనివారం ఉదయం నుంచి తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, ఆదివారం 130 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయి. గాలుల తీవ్రతకు సముద్రం అల్లకల్లోలమవుతుంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు సాధారణం కంటే 2 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఇళ్ల పైకప్పులు ఎగిరి పడటం, విద్యుత్తుస్తంభాలు విరిగిపడటం, రైలు, రోడ్డు మార్గాలు కొట్టుకుపోవడం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం మరోసారి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ప్రభుత్వాలకు సూచించింది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఐఎండీ ప్రత్యేక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశామని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి శాస్త్రి తెలిపారు.తుపాను విపత్తు కారణంగా వాటిల్లే నష్టాన్ని సాధ్యమైనంత కనిష్ఠస్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ప్రభావిత నాలుగు జిల్లాల్లోనూ మంత్రుల నుంచి ప్రత్యేక తుపాను సమన్వయ అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులు శుక్రవారం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad