బక్రీద్ ప్రాముఖ్యత ... ఈదుల్ ఫితర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 05, 2014

బక్రీద్ ప్రాముఖ్యత ... ఈదుల్ ఫితర్

ఇస్లాం ధర్మంలో రెండు పండగలకు గుర్తింపు ఉంది. ఒకటి రంజాన్. దీనిని ఈదుల్ ఫితర్ అంటరు. రెండవది బక్రీద్. దీనిని ఈదుల ఆదా అంటరు. దీనికే ఈదుల్ జుహా అని మరో పేరు కూడా ఉంది. ఈ పండగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటరు. సత్యం, ధర్మాలను కాపాడటానికి దైవాజ్ఞలను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి బక్రీద్ పండగలో ఖుర్బానీ ప్రక్రియ భక్తులకు బోధిస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్‌లో బక్రీద్ విషిష్టతలను వివరించారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండగ. జంతువు కుర్బానీ ఇచ్చే పండగ కనుక, దీనిని ఈదుల్ ఖుర్బానీ అంటరు. బక్రీద్ నాడు సాధ్యమైనంత వరకు ప్రతి ముస్లిం ఖుర్బానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఖుర్బానీ అంటే జంతువు మాంసాన్ని దానం చేయడం.


హదీష్ షరీఫ్‌లో ఖుర్బానీ విశిష్టతను చాలా ఘనంగా ప్రశంసించారు. దివ్య ఖురాన్‌లో కూడా ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి గురించి పొగడ్త ఉంది. ఖుర్బానీ జంతువు రక్తపు బిందువు భూమిపై పడక ముందే ఖుర్బానీ చేసే వ్యక్తి పాపాలన్నీ నశించిపోతాయి. ఖుర్బానీ జంతువు ఒక్కో రోమంలో ఒక్కో పుణ్యం లభిస్తుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఈ పండగ రోజు ప్రత్యేక నమాజ్ త్వరగా అంటే పది గంటల లోపే చదువుతారు. సాధ్యమైనంత వరకు ఏం తినకుండా ప్రార్థనకు వెళతారు.
ఖుర్బానీ ఇవ్వదలిచిన జంతువు ఏ విధమైన అంగవైకల్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఖుర్బానీగా గొర్రె, మేక, ఆవు, ఎద్దు, ఒంటె ఇంకా పెద్ద జంతువులను ఇవ్వొచ్చు. కోడిని, కోడి పుంజును ఇవ్వకూడదు. ఖుర్బానీ మాంసాన్ని సమపాళ్ళలో మూడు భాగాలు చేస్తారు. ఒక భాగం పేదలకు, రెండవ భాగం బంధువులకు, మూడో భాగం తమ సొంతానికి ఉపయోగిస్తారు. ఖుర్బానీ జిల్ హజ్జ నెల 10, 11, 12 తేదీలలో ఇవ్వొచ్చు. కానీ, జిల్ హజ్జ నెల 10వ తేదీన ఇవ్వడం ఉత్తమం. ఈ ఖుర్బాని చనిపోయిన తర్వాత సిరాత్ వంతెన దాటడానికి ఉపయోగపడుతుందని ఇస్లాం హదీసుల ద్వారా తెలుస్తుంది. ఈ బక్రీద్ పండగ నాడు ప్రతి ముస్లిం తన శక్తి మేర ఖుర్బానీ ఇవ్వాలని ఆశిద్దాం.


No comments:

Post a Comment

Post Bottom Ad