Video Of Day

Breaking News

6 నెలలుగా జీతాల్లేవు..పండుగ జరుపుకునేదెలా?

  ఆరునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో దసరా, బక్రీద్ పండుగలను ఎలా జరుపుకోవాలని 108 ఉద్యోగులు తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘం గురువారం రాత్రి ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. సీఎం చొరవ తీసుకుని తక్షణమే తమకు వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.  తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన పండుగలను రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో జరుపుకుంటుండగా, అత్యవసర వైద్య సేవలందిస్తున్న తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments