Video Of Day

Breaking News

రామ్ గోపాల్ వర్మ - శ్రీను వైట్ల మధ్య గొడవేంటి?

varma-vaitla
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఆగడు' పై ఎందుకు కామెంట్లు చేస్తున్నాడు? సెటైర్లు వేస్తున్నాడో తెలుసుకోవాలనుందా? అయితే వీరిద్దరి మధ్య గొడలు ఇప్పటివి కాదండీ! వర్మ.. సునీల్ హీరోగా తీసిన 'కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అప్పలరాజు' సినిమా నాటి నుంచి వీరి మధ్య గొడవలున్నాయి. అందులో ఒక పాటలో భాగంగా 'నమో వెంకటేశ' తీసిన శ్రీను వైట్లకు పంగనామాలే మిగిలాయని ఒక చరణం ఉంది. అందులో శ్రీనుపై కాకుండా అందరి దర్శకుల మీద సెటైర్లున్నాయి. అయితే శ్రీను దాన్ని సీరియస్ గా తీసుకుని ప్రతి సినిమాలో వర్మ మీద సెటైర్లు వేయడం, అవమానించేలా డైలాగ్స్ రాయడం చేస్తున్నాడు. దూకుడు సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం విలన్లకు మహేశ్ ఫొటో పంపకుండా వర్మ ఫొటో పంపిస్తాడు. అదేవిధంగా తాజా ఆగడులో అలాంటివే ఉన్నాయి. అందుకే ఒళ్లు
మండిన వర్మ అదే పనిగా ఆగడుపై తనదైన శైలిలో రచ్చరచ్చ చేస్తున్నాడు.

No comments