'ఆగడు'పై వర్మ ట్వీట్ల రచ్చ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 19, 2014

'ఆగడు'పై వర్మ ట్వీట్ల రచ్చ!


varma-comments-on-mahesh-aagadu Am told Aagadu is a 75 crore film nd.In sheer comparison Maghadeera looks like a 750 crore film

మహేష్ బాబు హీరోగా నటించిన 'ఆగడు' సినిమాను విడుదలైన రోజే శుక్రవారం చూసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన స్పందనను ట్విటర్ లో పోస్ట్ చేశారు. దూకుడు, బిజినెస్ మేన్, పోకిరి సినిమాల్లో నటించినట్టుగానే ఆగడులోనూ మహేష్ బాబు నటించాడని పేర్కొన్నారు. తను ఆగడు చూశానని, దూకుడు, బిజినెస్మేన్, పోకిరి సినిమాలను చూడడానికి వెళ్తున్నానని పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా ఆగడు, మగధీరకు పోల్చాడు. 'ఆగడు' రూ.75 కోట్ల సినిమా అయితే మగధీర రూ. 750 కోట్ల సినిమా అన్నాడు. ఈ రెండు చిత్రాలను సంబంధం లేకుండా ఎందుకు పోల్చాల్సి వచ్చిందో.. అడగకుండానే వివరణ కూడా ఇచ్చేశాడు మన డైరెక్టర్.


No comments:

Post a Comment

Post Bottom Ad