ఆమెకు లైంగిక వేధింపులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 16, 2014

ఆమెకు లైంగిక వేధింపులు

ఆసియా క్రీడల ఆరంభానికి ముందే ఇంచియాన్‌లో లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఇరాన్‌కు చెందిన ఓ సాకర్ అధికారి, ఓ మహిళా వాలంటీర్‌ను ప్రక్కనే నిలబడి ఫోటో దిగే సమయంలో ఆమెను తాకాడన్న ఆరోపణలు అలజడి సృష్టించాయి. దీనిపై ఓ కాలేజి విద్యార్థిని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయుడంతో దక్షిణకొరియా పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. అయితే ఇప్పటిదాకా అతన్ని కస్టడీలోకి తీసుకోకపోయినా... దేశం విడిచి వెళ్లొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును ప్రాసిక్యూటర్స్‌కు పంపాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయుం తీసుకోలేదని పోలీస్ ఇన్‌స్పెక్టర్ పార్క్ మిన్ జు చెప్పారు.
 

No comments:

Post a Comment

Post Bottom Ad