నిత్య మీనన్.. అప్పుడే అమ్మ అవుతుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 18, 2014

నిత్య మీనన్.. అప్పుడే అమ్మ అవుతుందా?

nitya-mother
చిన్న సైజు అరేబియన్ గుర్రంలా అదిరిపోయే అందాలున్న నిత్య మీనన్ .. చిన్న వయసులోనే అమ్మ అవుతుందంట! నిజంగా కాదులెండి! ఒక సినిమాలో తల్లి పాత్రలో నటించనుందని సమాచారం. శర్వానంద్ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ప్రేమ వయసెప్పుడూ పదహారే’ అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిత్యా మదర్ రోల్‌లో కొంత‌ పార్ట్ వున్నట్లు సమాచారం. ఐస్‌క్రీమ్ ఫేం తేజస్వి‌కి అమ్మగా రోల్ నచ్చడంతో నిత్యా సైన్ చేసిందని యూనిట్ చెబుతోంది. ‘రుద్రమదేవి’లో ఓ స్పెషల్ రోల్ చేసిన ఈమె, శర్వానంద్‌తో ఇంతకుముందు నటించిన ‘ఏమిటో ఈ మాయ’ రిలీజ్ కానుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad