మీడియాలో ఏం జరుగుతోంది? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 17, 2014

మీడియాలో ఏం జరుగుతోంది?


నిన్న మొన్నటి వరకు మీడియాలో పనిచేయడానికి ఎంతోమంది ఆసక్తి చూపించేవారు. మంచి కెరీర్స్ లో ఒకటిగా మీడియా విరాజిల్లింది. కానీ ఇప్పుడు మీడియా అంత పనికిమాలిన కెరీర్ మరొకటి లేదని జర్నలిస్ట్ సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. తెలుగునాట రెండు ప్రధాన పత్రికలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 4, 5 జిల్లాలను కలిపి ఒక చోట పెట్టడానికి ప్రణాళికలు సిద్దం అవుతున్నాయంట. తెలుగునాట రెండు ప్రధాన పత్రికలు.. ఇదే బాటలో ఉన్నాయని వినికిడి. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ లను రాజమండ్రిలోను, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు యూనిట్ లను గుంటూరులో, రాయలసీమ జిల్లాలను తిరుపతిలో పెడతారని టాక్. ఇక తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్/వరంగల్ లో ఎడిషన్ సెంటర్ లు ఉంటాయని ఒక జర్నలిస్ట్ మిత్రుడు విజన్ ఆంధ్రతో వాపోయాడు. అంతదూరం వెళ్ళే పరిస్థితి లేదని జాబ్ మానివేయడం తప్ప మరో దారి లేదని గోడు వెళ్ళబోసుకున్నాడు. జూలై లో పెంచాల్సిన జీతాలను ఇంతవరకు పెంచలేదని, జర్నలిజం అంటే తెలియని మేనేజ్మెంట్ వల్ల నానా బాధలు పడుతున్నామని తెలిపాడు. పనిగంటల కంటే 5, 6 గంటల ఎక్కువ గొడ్డు చాకిరీ చేయించుకుని పైగా ఎ, బి, సి గ్రేడ్లు ఇస్తున్నారని బాధపడ్డాడు. ఇలా మారిస్తే పిల్లల చదువుల ఏమైపోవాలని ఆక్రోశం వెలిబుచ్చాడు. ఇప్పటికే రెండు పత్రికల్లో క్షేత్ర స్థాయి సిబ్బందిని తొలగించి కడుపు కొట్టారని ఆవేదన చెందాడు. ఒక్కో పత్రికలో కనీసం 500 మందిని తొలగించడానికి ఆ పత్రికలు సిద్దంగా ఉన్నాయంట. వీళ్ళ బాగు కోసం పనిచేసేకంటే రెండు గేదలను మేపుకోవడం బెటరని ఆ మిత్రుడు ముగింపు పలికాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad