మహిళా హోంగార్డుపై అత్యాచారం, హత్య - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 05, 2014

మహిళా హోంగార్డుపై అత్యాచారం, హత్య

హైదరాబాదు : హైదరాబాదు శివారు ప్రాంతమైన మేడ్చల్ లో దారుణం సంభవించింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా హోంగార్డుపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పశువాంఛ తీరిన తర్వాత ఆమెను బండరాళ్లతో మోది చంపారు. స్థానికంగా ఉన్న బాసరేగడి అటవీప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతురాలు హైదరాబాదుకు చెందిన నవనీత అని పోలీసులు వెల్లడించారు. ఈమె సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad