వైశ్య కులం వల్లే అవకాశాలు ఇవ్వలేదంటున్న హీరోయిన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 30, 2014

వైశ్య కులం వల్లే అవకాశాలు ఇవ్వలేదంటున్న హీరోయిన్

heroien-kavitha-hotcomments
తెలుగుదేశం నాయకురాలు, ఒకప్పటి సినిమా హీరోయిన్ కవిత.. ఈమధ్య ఓ పత్రిక ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ప్రేక్షకులే నన్ను అభిమానించి, ఆదరించారు తప్ప... ఇండస్ట్రీవాళ్లు... తెలుగువాళ్లు నన్నెప్పుడూ ఆదరించలేదు. నేను తెలుగు సినిమాలు చేశాను, నటిగా టాలీవుడ్‌లో నిలబడ్డాను అంటే... అది కొందరు చిన్న దర్శకులు, నిర్మాతల వల్లే తప్ప ఏ టాప్ దర్శకుడూ, నిర్మాతా నన్ను ప్రోత్సహించిందే లేదు.
తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పెద్ద పెద్ద హీరోలందరి సరసన నటించాను. పెద్ద పెద్ద బ్యానర్లలో పని చేశాను. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అవార్డులు ఇచ్చాయి. కానీ తెలుగులో పరిస్థితి వేరు. అదేంటో కానీ... ఇక్కడి పెద్ద దర్శకులకి, నిర్మాతలకి నాలో మంచి నటి కనిపించనే లేదు! ఒకప్పుడు హీరోయిన్స్ అంటే శ్రీదేవి, జయప్రద, జయసుధ, నేను! ఆ పొజిషన్లో ఉన్నదాన్ని, అచ్చమైన తెలుగమ్మాయిని... అయినా వాళ్లెవరూ నాకు చాన్సులిచ్చేవారు కాదు. అసలు నన్ను పట్టించుకునేవారే కాదు. ఒక్కోసారి ఏడ్చేసేదాన్ని కూడా! ఇక్కడ ఎంత తెలుసు అన్నది కాదు... ఎవరు తెలుసు అన్నది ముఖ్యం! వాళ్ల లెక్కలు వేరే ఉంటాయి. నిజమైన టాలెంట్, నిజాయతీగా పనిచేసే తత్వం పనికి రావు. దానికి తోడు కులపిచ్చి ఒకటి. నాది వైశ్యకులం. కాబట్టి అవకాశాలిచ్చేవారు కాదు. ఎక్స్‌పోజింగ్ చేసేదాన్ని కాదు కాబట్టి నచ్చేదాన్ని కాదు. నా సినిమాలు వంద రోజులు, రెండు వందల రోజులు ఆడుతున్నా నేను వాళ్ల కళ్లకి కనిపించలేదంటే ఏమనాలి? ఇవాళ టాప్ డెరైక్టర్స్‌గా ఉన్నవాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు. నాకేం హీరోయిన్ పాత్రలివ్వక్కర్లేదు... తల్లిగానో, అత్తగానో తీసుకుంటే చాలు కదా! ఎవరో ముక్కూ ముఖం తెలియనివాళ్లని తెచ్చి చేయించుకుంటారు.  వందేళ్ల సినిమా వేడుక అప్పుడు ఐదో పదో సినిమాలు చేసి మాయమైపోయిన వాళ్లకి ఇన్విటేషన్లు పంపారు కానీ... నాలుగు భాషల్లో 130 సినిమాలు చేసిన నన్ను పిలవలేదు. నిజానికి అలా జరగడానికి కారణం... కమిటీకి ఓ తెలుగువాడు చైర్మన్ కావడం! బహుశా మరో భాష వాళ్లెవరైనా ఉంటే నన్ను మర్చిపోయేవారు కాదేమో. కానీ ఓ తెలుగు వ్యక్తి చేతుల్లోనే ఆ అధికారాన్ని పెట్టడం వల్ల నాకు అన్యాయం జరిగింది.

No comments:

Post a Comment

Post Bottom Ad