ఆ రోజు వెళ్లుంటే సిల్క్ స్మిత బతికుండేదంట! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

ఆ రోజు వెళ్లుంటే సిల్క్ స్మిత బతికుండేదంట!


anuradha-silksmita
తెలుగు సినీ పరిశ్రమలో సిల్క్‌ స్మిత హవా కొనసాగుతున్న కాలంలో-ఆమెను తట్టుకొని నిలబడి వ్యాంప్‌ క్యారెక్టర్లు చేసిన నటి అనురాధ. హీరోయిన్‌గా 30 సినిమాలు చేసి- డ్యాన్సర్‌గా స్థిరపడిన అనురాధ అనేక వందల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆమె ఓ పత్రిక ఇంటర్వ్యూలో అనేక విశేషాలు చెప్పారు.. 'సిల్క్‌స్మిత మొదట్లో నాతో మాట్లాడేది కాదు. ఆమె సొంత సినిమాలో నేను నటించా. ఆ తర్వాత బాగా మాట్లాడేది. మా మధ్య చనువు పెరిగింది. అప్పటి నుండి మేం మంచి ఫ్రెండ్స్‌గా మారాం. చాలా మంది సిల్క్‌ స్మితకు పొగరు అనుకునేవారు. కానీ ఆమె ఒక చిన్నపిల్లలాంటిది. అప్పుడప్పుడూ మీరందరూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలతో స్థిరపడ్డారు. నాకే ఏమీ లేదు అని బాధపడేది. వేరే ప్రాబ్లమ్స్‌ గురించి చెప్పేది కాదు. ఏమైనా తనలో తనే దాచుకుంటుంది. బయటపడదు. అదే ఆమె బలహీనత. ఎంత క్లోజ్‌గా ఉన్న వారితో అయినా ప్రాబ్లమ్స్‌ గురించి మాట్లాడేది కాదు. ఒక గిరి గీసుకుని, అందులోనే ఉండిపోయింది. బయటికి కనిపించే సిల్క్‌స్మిత వేరు, లోపల వేరు. ఆమె చనిపోవడానికి ముందు రోజు ఫోన్‌ చేసి- ‘మా ఇంటికి రావే..’ అని అడిగింది. ఆ రోజే మా ఆయన బెంగుళూరు నుండి వస్తున్నారు. అభికి, కెవిన్‌కి స్కూల్‌ ఉంది. వాళ్లని ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి వస్తానని చెప్పాను. ‘ఇప్పుడు రాలేవా? ఇప్పుడు రాలేవా?’ అని పదే పదే అడిగింది. తన గొంతులో ఉండే వేదనను పసిగట్టలేకపోయాను. ఆ రోజు నేను వెళ్లలేకపోయాను. ఒక వేళ ఆ రోజు నేను వెళ్లుంటే తను బాధలు చెప్పుకొనేదేమో.. కొంత సాంత్వన లభించి ఆత్మహత్య చేసుకొనేది కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad