ఆ రెండు చానెళ్ళ ను పాతరేస్తాడట కేసిఆర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 09, 2014

ఆ రెండు చానెళ్ళ ను పాతరేస్తాడట కేసిఆర్!


తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వేళ కొత్త శాసన సభలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తెలంగాణ ఉనికిని అగౌరపరిచిన టీవీ 9, ఏబీఎన్ చానెళ్ళ ను  పాతరే స్తామని అన్నారు  ముఖ్యమంత్రి కేసీఆర్ .వరంగల్ లో కాళోజీ శతయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం  మీడియా ఆందోళనపై  స్పందించారు. 'మా గడ్డ మీద ఉండాలంటే  మా ప్రాంతానికి సలాం కొట్టాలి.... తెలంగాణప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కరలేదని' అన్నారు. 'పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా పాతర ....పాతర వేస్తాం పదికిలోమీటర్ల దూరంలో' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నన్ను తిడితే బాధలేదని కానీ  తెలంగాణ శాసనసభ్యుల్ని తిట్టడం అవమానకరమన్నారు. తెలంగాణ శాసనసభ్యులంతా ఆ ఛానల్స్ పై సమిష్టిగా తీర్మానం చేశాయని,ఆ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. మేము తీర్మానం చేసిన వెంటనే  ఎంఎస్ వోలు  ఆ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేశారన్నారు.వారికి ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానని , ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకూ తీసుకుపోయి రాద్ధాంతం చేసింది ఆ చానెల్ వాళ్ళే నని ఇంకా ఎక్కువ చేస్తే ఏం చేయాలో అది చేస్తామని ఘాటుగా హెచ్చరించారు కేసీఆర్.

No comments:

Post a Comment

Post Bottom Ad