జాతీయ పార్టీగా టీడీపీని బలోపేతం చేద్దాం : ఏపీ సీఎం చంద్రబాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

జాతీయ పార్టీగా టీడీపీని బలోపేతం చేద్దాం : ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ :  తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చే విషయంలో అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలించడానికి సీనియర్ నేతలతో కమిటీ వేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించింది. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రావుల చంద్రశేఖరరెడ్డిలతో పాటు మరికొందరికి స్థానం దక్కనుంది. వచ్చే మహానాడులోగా ఈ కమిటీ విధివిధానాలను రూపొందించి పొలిట్‌బ్యూరో ముందు ఉం చుతుంది. వచ్చే ఏడాది జూన్ 27 నుంచి 29 వర కూ జరిగే మహానాడులోగా రెండు రాష్ట్రాల్లో  స మావేశాలు నిర్వహించి కమిటీలను వేస్తారు.  త రువాత పార్టీ జాతీయ కమిటీని నియమిస్తారు.
ఆంద్రప్రదేశ్ విడిపోయిన అనంతరం సీమాంద్రలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ... తెలంగాణలో కూడా కాస్తా ఊరటనిచ్చే ఫలితాలే వచ్చాయి. అయితే రెండు కొత్త రాష్ర్టాల్లో తెలుగుదేశం పార్టీకి బలం బాగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ర్టాల్లో తెలుగుదేశం పార్టీ కొనసాగాలంటే జాతీయ పార్టీగా ప్రకటించక తప్పలేదు. అంతేగాక రెండు రాష్ర్టాల్లో పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు బలమైన కేడర్ ను టీడీపీ సంపాదించుకుంది. దీంతో వచ్చే ఎటువంటి ఎన్నికలైనా ఎదుర్కొవాలంటే ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా రెండు రాష్ర్టాల్లో అధ్యక్షులు, కార్యదర్శుల నియామకాలు కూడా జరిగాయి. 
టీఆర్ ఎస్ వైపు మొగ్గుచూపుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలుః
తెలంగాణ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ర్ట సమితి వైపు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇతర చిన్నా చితక పార్టీల్లో కార్యకర్తల నుంచి లీడర్ల వరకు టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేగాదు కొందరు పెద్ద నాయకులు సైతం టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అధికారంలో ఉన్న పార్టీ వైపు ఎవరైనా మొగ్గు చూపుతారు. అయితే పార్టీలో కార్యకర్తల బలం ఉంటే చాలు వీరు కాకపోతే కొత్తగా వచ్చే లీడర్లకు ఛాన్స్ వస్తుందని అధినేత చంద్రబాబు మదిలో ఉన్నట్లు పరిశీలకుల అంచనాలు. కావున పోయేవారు పోయినా... కొత్తవారిని ప్రోత్సహిస్తే తెలంగాణలో టీడీపీ బలం పెరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad