తెలంగాణలో వర్షాలు రాకపోవడానికి బాబే కారణం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, August 25, 2014

తెలంగాణలో వర్షాలు రాకపోవడానికి బాబే కారణం

హైదరాబాద్ : 
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తెలంగాణపైనా ప్రభావం చూపిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఆయన అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ వర్షాలు పడడంలేదని ప్రజలు అనుకుంటున్నారని నాయిని పేర్కొన్నారు. నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు. 
చంద్రబాబుతో జత కలిసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని నాయిని ఆరోపించారు. తాము చేపడుతున్న పథకాలు చూసి ఓర్వలేని టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ కార్యక్రమంలో మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad