ఈనాడు పత్రికలో ఏమాత్రం నిజంలేదు: దిగ్విజయ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, August 25, 2014

ఈనాడు పత్రికలో ఏమాత్రం నిజంలేదు: దిగ్విజయ్

హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రె స్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. మెదక్ సీటు పై కేసీఆర్‌తో చర్చిద్దామని తాను అన్నట్లుగా "ఈనాడు" పత్రికలో వచ్చిన వార్తను ఖండించారు. కాంగ్రెస్ కార్యాచరణ సదస్సు వేదికపై ప్రసంగించిన దిగ్విజయ్‌సింగ్ "ఈనాడు" పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ అవగాహనకు వస్తున్నట్లుగా వచ్చిన వార్త అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. కచ్చితంగా ఎన్నికల్లో పోరాడతాం. సొంతంగానే అభ్యర్ధిని బరిలో దించుతాం’’అని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో పొత్తుండబోదనే సంకేతాలను దిగ్విజయ్ కార్యకర్తలకు పంపారు

No comments:

Post a Comment

Post Bottom Ad