హత్యా రాజకీయాలపై అట్టుడికిన అసెంబ్లీ : సభ్యులపై స్పీకర్ సీరియస్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, August 19, 2014

హత్యా రాజకీయాలపై అట్టుడికిన అసెంబ్లీ : సభ్యులపై స్పీకర్ సీరియస్

హత్యలపై ఇరు పార్టీల లెక్కలు
ప్రశ్న ఒకటైతే... అంశం మరోకటి..
సభ్యుల తీరుపై... అసెంబ్లీలో గందరగోళం..

హైదరాబాద్ :  రాష్ర్ట విభజన అనంతరం జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్  బడ్జెట్ సమావేశాలు రసాబాసాగా సాగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి బతికి బట్టకట్టిన రెండు పార్టీలు అధికార పార్టీ టీడీపీ, ప్రతి పక్ష పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసెంబ్లీ వేధి
కగా విలువైన సమయం వృధా అవుతోందని ఎపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యేలకు సమస్యలపై గళం విప్పేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్ ఇరు పార్టీలను కోరారు. అయితే సమస్యలపై కాకుండా హత్యా రాజకీయాలపై ప్రతిప క్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ సమస్యను లేవనెత్తగా... దానికి ధీటుగా అధికారపార్టీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర స్పందించారు. మనిషి ప్రాణాలు పోతున్నా... దీనిపై ప్రభుత్వంపై స్పందన లేదని జగన్ విమర్శలు గుప్పించారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ పరిటాల రవి హత్యకేసులో ప్రధాన ముద్దాయి అయిన మీరు టీడీపీ హత్యా రాజకీయాలు చేస్తోందని అనడం సరికాదని... అసలు రవి హత్యకేసులో జైళ్లో ఉన్న ఖైదీలను... బయట ఉన్న ఉన్న వ్యక్తులను సైతం సాక్ష్యాలు లేకుండా హత్యలు చేసిన ఘనత మీదంటూ అచ్చెన్నాయుడు అన్నారు. ఇలా సభను చర్చించాల్సిన సమస్యలపై... అంశాలపై చర్చించకుండా ఇరు పార్టీలు శాసనసభ విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తున్నారని స్పీకర్ అబ్యంతరం చెప్పడం జరిగింది. వక్ఫ్ ఆస్తుల విషయంలో, వాటి నిర్మాణాన్ని చెపట్టాలని ప్రతి పక్ష నేత జగన్ ప్రశ్న లేవనెత్తగా వాటికి సంబంధించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యే భాషా ముస్లింల సంక్షేమం లేకపోవడం వల్ల పలు రకాల దుకాణాల్లో కార్మికులుగా మెలుగుతున్నారని ఆయన అన్నారు. శాసనసభలో సైతం ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉందని... వైసీపీ ఇచ్చిన సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ కేటాయించలేదని అన్నారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ .. అడిగిన ప్రశ్నలు వేరు... మీరు చెబుతున్నది వేరు.. అంశాన్ని పక్కదోవ పట్టించి సభా సమయాన్ని వృదా చేయద్దని సూచించారు. ఈ విధంగా రెండు పార్టీలు అసెంబ్లీ సమయాన్ని  వృధా అవుతోందని పలువురు సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad