2.3 సెకండ్లలో 20 వేల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, August 21, 2014

2.3 సెకండ్లలో 20 వేల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి!


చైనా యాపిల్ ఫోన్ గా వినియోగదారులు పిలుచుకుంటున్న జియోమీ ఎమ్ఐ3 రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ 'ఫ్లిప్ కార్ట్'లో కేవలం 2.3 సెకండ్లలోనే 20 వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఫిఫ్త్ ఫ్లాష్ సేల్ లో భాగంగా ఈ కొనుగోళ్లు జరిగాయని జియోమీ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బార్రా తెలిపారు. గత వారం ఫోర్త్ ఫ్లాష్ సేల్ లో 2.4 సెకండ్లలో 20 వేల ఫోన్లు అమ్ముడయ్యాయని ఆయన వెల్లడించారు. తదుపరి ఫ్లాష్ సేల్ ఆగస్ట్ 26న ఉంటుందని జియోమీ ప్రకటించింది. ఈ ఫోన్లు ఓపెన్ మార్కెట్లో లభించడం లేదు. కేవలం ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే వినియోగదారులకు అందిస్తోంది జియోమీ. కనీసం ఫోన్ల సంఖ్యనైనా 20 వేల నుంచి మరింత ఎక్కువకు పెంచాలని మొబైల్ ప్రియులు సోషల్ నెట్ వర్క్ ల ద్వారా జియోమీకి సందేశాలు పంపుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad