తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 29, 2014

తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు

హైదరాబాద్: ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకొని మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నెల రోజుల ఉపవాస దీక్షలను ముగించుకొని మంగళవారం తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈద్గాలలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశాయి. ముస్లిం సోదరులకు అటు రాజకీయనాయకులు, ఇటు ప్రభుత్వ ఉన్నతా
ధికారులు ఈద్గాలల్లో కలుసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు
తెలిపారు. హైదరాబాద్ నగరంలో మక్కా మసీద్, మీరాలం మండీ ఈద్గాలో వేలాది సంఖ్యలో హాజరైన ముస్లింలు భక్తి శ్రద్ధలతో అల్లాకు ప్రార్థనలు చేశాయి. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు, మంత్రులు, శాసనసభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు ముస్లిం సోదరులను ఈ ద్గాలలో కలుసుకొని తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. 

1 comment:

  1. సడే సంబడం. రంజాన్ పండుగ జరుపుకొనే వారిలో అతిస్వల్ప శాతం తెలుగు వారు!

    ReplyDelete

Post Bottom Ad