పవన్ వల్లే టీడీపీ గెలిచింది: రోజా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 23, 2014

పవన్ వల్లే టీడీపీ గెలిచింది: రోజా


చిత్తూరు: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికలలో, పోటి చేద్దమను అనుకుండు కాని ఒట్లు చిలిపోతాయని  ఎన్నికలలో నిలబడకుండా టిడిపి-బిజెపి పొత్తుకు మద్దతుగా ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో సంచలనం సృష్టిచాయి. కాగా తనకు అధికారం ముఖ్యం కాదని ఏ పార్టీ తప్పు చేసినా ప్రశ్నించడానికి తయారుగా ఉన్నానని పవన్ ఎప్పుడో స్పష్టం చేసారు.   పవన్ వల్లె ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా స్సష్టం చేశారు. మంగళవారం చిత్తూరులో రోజా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతుల రుణమాఫీపై చంద్రబాబు ప్రకటనలో స్ఫష్టత లేదని తెలిపారు. రుణమాఫీల కోసం రైతులను మభ్యపెట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రుణమాపీపై కమిటీలు వేశామంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad