ఇంటికి ఒక్కటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, July 21, 2014

ఇంటికి ఒక్కటే..

తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే సామాజిక పింఛన్ ఇవ్వాలని అనుకుంట్టుంది.. కొన్నిచోట్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెన్షన్ పొందుతుండడం.. ఉద్యోగుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ వర్కర్లుగా ఉన్నవారూ పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్తగా తెలంగాణ ప్రభుత్వ లోగోతో కార్డులు పంపిణీ చేయనున్న సమయంలోనే.. జల్లెడ పట్టి అనర్హులను తొలగించనుంది. ఒక ఇంటికి ఒకే పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే  అంగవైకల్యం ఉన్నవారికి మాత్రం ఇంట్లో ఇంకెవరు పొందుతున్నా కూడా.. పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక అంగన్‌వాడీల్లో వర్కర్లుగా పనిచేస్తున్న వితంతువులు... వర్కర్‌గా వేతనాలు తీసుకుంటూనే, వితంతు పెన్షన్ కూడా పొందుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. .
 కొత్త కార్డులతో షురూ..!
 దసరా దీపావళి నాటికి పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొత్త కార్డులను పంపిణీ చేసే సమయంలోనే.. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అందుతున్న పెన్షన్లను జల్లెడ పట్టనున్నట్లు ప్రభుత్వవర్గాలు వివరించాయి. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికలకు నెలకు రూ. 200, వికలాంగులకు రూ. 500 చొప్పున పింఛన్లను చెల్లిస్తున్నారు. ప్రస్తుత పెన్షన్ల ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ. 872 కోట్ల భారం పడుతుండగా.. అందులో రూ. 272 కోట్ల వరకు కేంద్రం భరిస్తోంది. అయితే ఈ పెన్షన్లను వికలాంగులకు రూ. 1,500కి, మిగతావారికి రూ. వెయ్యికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... ఈ భారం రూ. 3,900కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. దీంతో నిజంగా అర్హులకు మాత్రమే పింఛన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ల పథకంలో భరీగా అవినీతి చోటు చేసుకుంటోందని.. దానిని అరికట్టాల్సి ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం.

No comments:

Post a Comment

Post Bottom Ad