గోపాల గోపాలలో పవన్ పాత్ర 25 నిముషాలే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 22, 2014

గోపాల గోపాలలో పవన్ పాత్ర 25 నిముషాలే

 gopala gopala role 25 minutes

హైదరాబాద్: కిషోర్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం 25 నిముషాలు మాత్రమే కనిపిస్తారని ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... తాను పవన్ కల్యాణ్ కి వీరాభిమానినని చెప్పారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాలగా నిర్మిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు అని చెప్పారు. గోపాల గోపాల చిత్ర హీరో వెంకటేశ్, పవన్ కల్యాణ్ ల మధ్య చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయన అన్నారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్ ల డైలాగ్ లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని వెల్లడించారు .2015 సంక్రాంతి పండగ నాటికి ఈ గోపాల గోపాల చిత్రం విడుదలవుతుందని కిషోర్ కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad