వచ్చే నెలాలో ఎంసెట్ అడ్మిషన్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, July 20, 2014

వచ్చే నెలాలో ఎంసెట్ అడ్మిషన్లు

హైదరాబాద్ : వచ్చే నెలాఖరులోగా ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బోధన రుసుములను తెలంగాణ పిల్లలకే ఇవ్వాలన్న అంశాలపై ఈ నెల 16న కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు మూడు రోజులలో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కానున్నా యి. ఈ నిబంధనలను ఆధారం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకూడా ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. అడ్మిషన్లకు సంబంధించిన జీవోలు సోమవారం లేదా మంగళవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం తర్వాత ప్రకటించే అవకాశాలున్నాయి. వెబ్ కౌన్సెలింగ్ తేదీల ప్రకటనపై రెండు రాష్ర్టాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులతో కలిసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్ వేణుగోపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు మొదటివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు విద్యా మండలి అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad