తూచ్... వారానికి కాదు నెలకు నాలుగు రోజులు!! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 09, 2014

తూచ్... వారానికి కాదు నెలకు నాలుగు రోజులు!!

chandrabau-not-coming-to-ap
వారంలో నాలుగు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చనున్నారా?  వారానికి కాకుండా నెలకు నాలుగు సార్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండనున్నారా? గత నెల రోజులుగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి చూస్తే అవుననే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి నెల రోజులు అయిన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కు కేవలం మూడు సార్లే వచ్చారు. అందులో రెండుసార్లు అధికారులతో సమావేశానికే పరిమితమయ్యారు.  ఢిల్లీ చుట్టూ నాలుగు సార్లు చక్కర్లు కొట్టడం విశేషం. ఇదిలాఉంటే తీరికలేని పనుల కారణంగానే ప్రజలకు చంద్రబాబు అందుబాటులో ఉండలేకపోతున్నారని మంత్రి ప్రతిపాటి పుల్లారావు సీఎంను వెనుకేసుకొస్తున్నారు. ఇంకే చంద్రబాబు ఏడాదికి ఒకసారి వచ్చినా పర్వాలేదు!!

No comments:

Post a Comment

Post Bottom Ad