అల్లుడు శ్రీనుతో బోయపాటి శ్రీను - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, July 26, 2014

అల్లుడు శ్రీనుతో బోయపాటి శ్రీను

 alludu-srinu-boyapati-srinu

తొలి సినిమాతో హీరో మెటీరియల్ వుంది అని ప్రూవ్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఇద్దరు పెద్ద దర్శకులు రెడీ అవుతున్నారు. దర్శకుడు సుకుమార్ తాను నిర్మాతగా వ్యవహరిస్తూ, తన సహాయకుల్లో ఒకరికి అవకాశం ఇచ్చి, శ్రీనివాస్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు.
మరో పక్క బోయపాటి శ్రీను ఓ కథను సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కథపై చాలా సీరియస్ గానే చర్చలు సాగుతున్నాయి. బహుశా ఇది బెల్లంకొండ బ్యానర్ లోనే వుండొచ్చు. బోయపాటి కథ దాదాపు కొలిక్కి వచ్చింది. సుకుమార్ ది మాత్రం ప్రాజెక్ట్ ఓకె అయింది. కథ రెడీ కావాలి. వినాయక్ లాంటి దర్శకుడితో తెరగ్రేటం చేసి, సుకుమార్, బోయపాటి లాంటి వాళ్లతో సినిమాలు అంటే బెల్లంకొండ తన కొడుకు విషయంలో చాలా పట్టుదలగా వున్నట్లు అర్థం అవుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad