సీఎం వద్దే డబ్బుల్లేవు.. మనకేం ఇస్తారు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, July 12, 2014

సీఎం వద్దే డబ్బుల్లేవు.. మనకేం ఇస్తారు

 Personal property will be given to the Chief Minister to give a .

హైదరాబాద్ : రాష్ట్ర ఖజానా నిండుకుండ అయితే ముఖ్యమంత్రిని నిధులు అడగొచ్చు. సీఎం వద్దే డబ్బుల్లేవు. కార్పొరేషన్‌కు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు. అని నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేషన్లో అధికారులు జీవోలను సక్రమంగా అమలు చేస్తే ఎవర్నీ నిధులు కోసం అడగక్కర్లేదన్నారు. నగరపాలక సంస్థ రూ.350 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు. నగరానికి శనివారం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు.
 డంపింగ్‌యార్డుకు ఆగి రిపల్లి మండలంలో 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్థల కేటాయింపు విషయమై నూజివీడు సబ్ కలెక్టర్‌తో చర్చించామన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డు సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాల వల్లే కార్పొరేషన్ దివాళా తీసిందని దుయ్యబట్టారు.

No comments:

Post a Comment

Post Bottom Ad