సీఎంలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, July 31, 2014

సీఎంలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి


హైదరాబాద్: ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించండంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తులని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రజల్లో ఉద్వేగాన్ని, ఉద్రేకాల్ని రెచ్చగొట్టి సమస్యలను దారి మళ్లిస్తారని అని ఆయన విమర్శించారు. కేసీఆర్, చంద్రబాబులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తమ్మినేని సూచించారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తామంటునే వ్యవసాయాన్ని ముడిపెట్టడం మంచిది కాదు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తాననే కేసీఆర్...రాబోయే బడ్జెట్‌లో తన మాట నిలుపుకోవాలని తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad