Video Of Day

Breaking News

tv9 కార్యాలయాన్ని తీసెయ్యండి

tv9 office Remove

బంజారాహిల్స్: తెలంగాణ ముఖ్యమంత్రి కే సీఆర్‌తోపాటు తెలంగాణ శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9 చానల్‌ను వెంటనే ఇక్కడినుంచి తీసేయాలంటూ నవతెలంగాణ టీఆర్‌ఎస్ బ్రాహ్మణ, అర్చక సేవాసంఘం సభ్యులు శనివారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అడ్వకేట్ల జేఏసీ సభ్యులతోపాటు అర్చకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి చేరుకొని తెలంగాణ శాసనసభ్యులకు టీవీ9 తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మా ఎమ్మెల్యేలను పాచిపోయిన కల్లుతో పోలుస్తారా..? టూరింగ్ టాకీస్‌లో కూర్చొండే ముఖాలంటారా..? అని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

No comments