ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కాదు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 05, 2014

ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కాదు

Pawan Kalyan not to get the dialog '

 'ఆగడు'లో ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగులపై పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాపై ఘాటుగా స్సందించారు. మా హీరోపై సెటైర్లు వేస్తారా అంటూ నిష్టూరమాడారు. దాంతో తాను చెప్పిన డైలాగు 'ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్.. ఎలపరం వచ్చేస్తోంది' అంటూ డైలాగుపై మహేష్ బాబు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ డైలాగులు చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు ఎవరినీ ఉద్దేశించి ఈ డైలాగులు రాయలేదని చెప్పారు. పాత్ర స్వభావానికి అనుగుణంగా డైలాగులున్నాయని వివరించారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో 'సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా' అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ బాగా పాపులరైన సంగతి తెలిసిందే.అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘
ఆగడు'లో  డైలాగ్స్
_ 'ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్..ఎలపరం వచ్చేస్తోంది'
_ 'సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు గానీ.. పంచ్ డైలాగ్ ల ప్రభావం గట్టిగా ఉంది'
_ఇప్పుడు చెప్పండిరా బాబులు.. వాట్ టు డు వాట్ నాట్ టు డు..'

1 comment:

  1. There is a lot of difference between Pawan and mahesh...... PAWAN was real hero, his popularity in public was not effected by his cinema hit or flop............ MAHESH was fully financial mind, he was done any type of ad for money....

    ReplyDelete

Post Bottom Ad