Video Of Day

Breaking News

రైతులకు న్యాయం చేస్తా : పోచారం

హైదరాబాద్ : తెలంగాణ రైతాంగానికి సంపూర్ణ న్యాయం చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు .రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామని హామీనిచ్చారు.వరదల్లో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు.విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments