Video Of Day

Breaking News

2013 జూన్ నుంచి 2014 మే వరకు రైతులు తీసుకున్న పంటరుణాల మాఫీ


హైదరాబాద్: లక్షలోపు రైతురుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్యాంకుల వారీగా పంటరుణాల వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బ్యాంకు అధికారులను ఆదేశించారు. రైతు రుణాలకు సంబంధించిన ఖాతాలు, రుణాల వివరాలను అందజేయాలన్నారు.

2013 జూన్ నుంచి 2014 మే వరకు రైతులు తీసుకున్న పంటరుణాల మాఫీ కోసం రూ. 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. దీనిద్వారా 30 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. బుధవారం సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తొలి సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ)లో సీఎం కేసీఆర్ రైతు రుణాల మాఫీపై స్పష్టత ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 2013 జూన్ నుంచి 2014 మే నెలాఖరు వరకు రైతులు తీసుకున్న పంట రుణాల్లో లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల వాగ్దానానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు.

No comments