తండ్రి ప్రేమను సమర్థించిన తనయుడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, May 02, 2014

తండ్రి ప్రేమను సమర్థించిన తనయుడు!

digvijay second marriage son support

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ ప్రేమాయణాన్ని ఆయన కుమారుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే జైవర్దన్‌సింగ్ సమర్థించారు. తన తండ్రి పునర్వివాహం అంశం పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తండ్రికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాజ్యసభ టీవీ యాంకర్ అమృతారాయ్‌ను తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు దిగ్విజయ్  ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం  తెలిసిందే.  అమృతారాయ్ తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని, ధైర్యంగా బహిరంగ పరిచినట్లు కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలని వెల్లడించారు. అమృతారాయ్ కు కోర్టు విడాకులు మంజూరు చేసిన  వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad