రుణమాఫీ పై బాబు తప్పించుకుంటున్నారా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, May 27, 2014

రుణమాఫీ పై బాబు తప్పించుకుంటున్నారా?

debtmapi babu Evading?


 న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో అంతులేని సమాధానాలు రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నా..... పస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు పజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలవి విభజన అనంతర పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉంది చర్చ జరగాల్సి ఉందని ప్రకటన.  ఏపీ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాటతీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నానంటూనే... . రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తాను హామీ ఇచ్చానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిపై చర్చ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే సమయానికి రాష్ట్రం విడిపోయింది కదా అని ప్రశ్నించగా... అవును, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదంటూ  సమాధానం చెప్పారు. రుణమాఫీపైనే తొలిసంతకం ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా... ఏయే మార్గాలున్నాయో అన్నీ అన్వేషిస్తున్నాం, మీకు కూడా తెలిస్తే చెప్పండంటూ సమాధానం దాటవేశారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీభవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతాన్ని పునాదుల నుంచి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. తెలంగాణతో సమానంగా సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేలా కేంద్రం ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. . దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్‌డీఏతో పొత్తుపెట్టుకున్నామన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు నిజాయితీపరుడైన అశోక్‌గజపతి రాజుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad