వాస్తు వల్ల సీఎం కార్యాలయం మార్చాల్సిందే' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, May 27, 2014

వాస్తు వల్ల సీఎం కార్యాలయం మార్చాల్సిందే'

The office of cm office change

హైదరాబాద్ : . నిన్న కేసీఆర్... తాజాగా చంద్రబాబు నాయుడు వాస్తు నమ్మకాలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బాబు సచివాలయ ఏర్పాటు వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. హెచ్ బ్లాక్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న  సీఎం కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు వాస్తు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ బ్లాక్ వాస్తుకు అనుకూలంగా లేనందున సీఎం కార్యాలయం మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఎల్ బ్లాక్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా అధికారులు మార్పులు చేస్తున్నారు. ఎల్ బ్లాక్ లోని 7, 8 అంతస్తులను చంద్రబాబు కార్యాలయం కోసం కేటాయించటం జరిగింది. దీంతో ఎల్ బ్లాక్ లో ముఖ్యమంత్రి  కార్యాలయ ఏర్పాటుకు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad