చంద్రబాబు విదేశీ ఖాతాల్లో భారీ ఆస్తులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, May 02, 2014

చంద్రబాబు విదేశీ ఖాతాల్లో భారీ ఆస్తులు!

chandrababu-assets-in-foreign-banks

సింగపూర్‌లోని డాయిష్ బ్యాంకులో రూ. 4.9 కోట్లు, క్రెడిట్ సూసి బ్యాంకులో రూ. 878 కోట్లు, నాట్‌వెస్ట్ బ్యాంకులో రూ. 1,284 కోట్లు చంద్రబాబు ఖాతాల్లో ఉన్నాయని  చంద్రబాబు ఒకప్పటి సన్నిహితుడు, యూరో లాటరీ వ్యవహారంలో నిందితుడు కోలా కృష్ణమోహన్  అన్నారు. ఇవికాక ఆయన సింగపూర్‌లోని మారియట్ హోట ళ్ల షేర్లను అమ్మేసి 3,600 కోట్ల రూపాయలు పొందారని కూడా పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇన్ని ఆస్తులుంటే ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 42 కోట్లు మాత్రమే ఉన్నట్లు బొంకారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ ఖాతాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను లేఖ రాయబోతున్నానని, అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు తన వద్ద నాలుగు కోట్ల రూపాయలకు పైగా డబ్బు తీసుకుని మచిలీపట్నం లోక్‌సభ స్థానం కేటాయిస్తానని మోసం చేశారని, ఆ తరువాత తన డబ్బు కూడా తిరిగివ్వలేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనను ఇప్పటికి రెండుసార్లు కిడ్నాప్ చేయించారన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మనుషులు విజయవాడలో తనను అపహరించారని వివరించారు. రెండేళ్ల క్రితం తాను చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, వాటిలో భారీగా నిధులున్నాయని చెబితే టీడీపీకి చెందిన వర్ల రామయ్య వంటి వారు అందులో నిజం లేదని తేలిగ్గా మాట్లాడారని చెప్పారు. అప్పట్లో తన వద్ద సాక్ష్యాధారాలు లేవు కనుక తిరిగి మాట్లాడలేదని కృష్ణమోహన్ అన్నారు. ఇపుడు విదేశీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు దొరికాయి కనుక ధైర్యంగా వాటిని మీడియా ముందుంచుతున్నానని జిరాక్స్ ప్రతులను అందజేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad