బాబుకు ఓట్లు ఎందుకు వేశామా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, May 28, 2014

బాబుకు ఓట్లు ఎందుకు వేశామా!

Why has the votes away..nallapareddy

నెల్లూరు : తెలుగుదేశం పార్టీ ఏడాదిలోపే అధికారం కోల్పోవడం ఖాయమని కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.  . సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అవి నెరవేర్చే అవకాశం లేదన్నారు. బాబుకు ఓట్లు ఎందుకు వేశామా... అని ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారన్నారు. 2015 ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరులోపు టీడీపీ ప్రభుత్వఅదికారం పోవడం కాయమన్నారు

 ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రసక్తే లేకపోవడంతో గ్రామాల్లోకి వచ్చే ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారని నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యంతర ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన అన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad