నాలుగైదు రోజుల్లో కేవీపీ అరెస్టు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, April 26, 2014

నాలుగైదు రోజుల్లో కేవీపీ అరెస్టు!

kvp-arrest-in-four-or-five-days

నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా చెప్పుకుంటూ.. ప్రభుత్వంలో చక్రం తిప్పిన కేవీపీ రామచంద్రరావుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అయన అరెస్టుకు ఢిల్లీలోని సీబీఐ విభాగం వారెంటు సిద్ధం చేస్తోంది. అది అందుకున్న వెంటనే అరెస్టు చేయడానికి రాష్ట్ర సీఐడీ అధికారులు సన్నద్ధమయ్యారు. మొత్తంగా మరో నాలుగైదు రోజుల్లోనే కేవీపీ అరెస్టయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవీపీ.. టైటానియం కుంభకోణం వ్యవహారంలో రెడ్‌కార్నర్‌ నోటీసు, ప్రొవిజనల్‌ అరెస్టు వారెంటుపై తదుపరి చర్యలు నిలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ శుక్రవారం లంచ్‌మోషన్‌లో (అత్యవసరంగా) వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీనిపై సాధారణ పిటిషన్‌ దాఖలు చేయాలని కేవీపీ తరపు న్యాయవాదికి సూచించింది. దీంతో సాధారణ పద్ధతిలోనే కేవీపీ తరపు న్యాయవాది శుక్రవారం సాయంత్రం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కేవీపీపై జారీ అయిన రెడ్‌కార్నర్‌ నోటీసు సీఐడీకి అందినా అరెస్టు వారెంటు మాత్రం రాలేదు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందంలో భాగంగా కేవీపీని అమెరికా పంపించడానికి మాత్రం మరికొంత సమయం పట్టవచ్చు. కేవీపీపై టైటానియం ప్రాజెక్టు కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ దాఖలైన సంగతి తెలిసిందే. దాంతో కేవీపీనీ అమెరికా రప్పించేందుకు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఈ కుంభకోణంలో నిందితులైన ఆరుగురిపై ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించారు. కేవీపీపై జారీ అయిన నోటీసును గత మంగళవారం ఢిల్లీలోని ఇంటర్‌పోల్‌ వ్యవహారాలు చూసే సీబీఐ విభాగం రాష్ట్ర సీఐడీ అధికారులకు పంపింది. రెడ్‌కార్నర్‌ నోటీసు శుక్రవారం తమకు అందిందని, అయితే అరెస్టు వారెంటు మాత్రం రాలేదని, దీనికి సంబంధించిన వివరాలు కోరుతూ తాము సీబీఐకి ఫ్యాక్స్‌లో లేఖ పంపామని రాష్ట్ర సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు. సీబీఐ నుంచి వారెంటు అందిన తర్వాత మిగతా ప్రక్రియ పూర్తిచేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad