ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌పై వేటు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 15, 2014

ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌పై వేటు

ప్రేమ పేరుతో ఖాకీ ముసుగులో  రజియా సుల్తానా అనే అమ్మాయిని మోసం చేసిన ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌పై ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పొన్నూరుకు చెందిన రజియా సుల్తానాను ఇంటర్ చదివే రోజుల్లో (2009, జూలైలో) అప్పటి ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ తనను ప్రేమపేరుతో మోసం చేశాడని అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా పోలీస్ అధికారులు రంగనాథ్‌గౌడ్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ కొన్నాళ్ల తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేశాక నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యాడు.

అప్పటి నుంచి రజియా సుల్తానా న్యాయపోరాటం సాగిస్తూనే ఉన్న రజియా తనకు న్యాయం చేయాలంటూ కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకుంది. దీనికితోడు గుంటూరు రేంజి ఐజీ సునీల్‌కుమార్ కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకటికి రెండుసార్లు రజియాసుల్తానా ఆవేదనను విన్నారు. ఒంగోలు డీఎస్పీ జాషువాను న్యాయవిచారణ జరపాలని ఏడాది కిందట ఆదేశాలు జారీ చేశారు.

గత డిసెంబరులో గుంటూరు వచ్చిన డీఎస్పీ జాషువా నివేదిక అందుకున్న ఐజీ సునీల్‌కుమార్ ఎస్‌ఐ రంనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. రజియా సుల్తానా కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లోనూ రంగనాథ్‌గౌడ్ పాత్ర ఉన్నట్లు విచారణలో రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐజీ పేర్కొనడం గమనార్హం. 

No comments:

Post a Comment

Post Bottom Ad