కొత్త ముఖ్యమంత్రికే కాంగ్రెస్ ఓటు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2014

కొత్త ముఖ్యమంత్రికే కాంగ్రెస్ ఓటు!

రాష్ట్ర విభజన పక్రియ జరుగుతుండగా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ వారసుడిని వెతికే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి మెజారిటీ ఉందనే భావనలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నాయకులు అందరితోను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీలోని సీమాంధ్ర సీనియర్లతో దిగ్విజయ్‌ సింగ్ మాట్లాడనున్నారు. సీమాంధ్రకు ఏం చేస్తే ప్రజల్లో మంచి భావం ఏర్పడుతుందో వారితో  దిగ్విజయ్‌ చర్చించనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా అనే అంశంపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వాఖ్యానించారు. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే కొత్త సీఎం ఎవరు అనే అంశాన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని షిండే తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని, తుది నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్‌దే అని షిండే ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయముంది షిండే తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad