నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 15, 2013

నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష

నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన దోషులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
1. రామ్‌సింగ్ (34) (ప్రధాన దోషి. తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు). బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు.
2. అక్షయ్ ఠాకూర్ (28). ఉపాధి కోసం ఢిల్లీ వచ్చాడు.
3. వినయ్ శర్మ (20). అసిస్టెంట్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్
4. ముకేశ్‌సింగ్ (26). రామ్‌సింగ్ సోదరుడు. దక్షిణ ఢిల్లీలో వుురికివాడలో సోదరుడితో కలిసి జీవించాడు.
5. పవన్ గుప్తా (19). పండ్ల వ్యాపారి.
ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ) (సామూహిక అత్యాచారం) కింద కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది.

ఇదే కేసులో ఆరో నిందితుడైన బాల నేరస్తుడికి కొద్ది రోజుల కిందట బాలనేరస్తుల న్యాయ బోర్డు మూడేళ్ల శిక్ష విధించటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన బాధితురాలి కుటుంబం.. ఇదే కేసులో మిగతా నలుగురు దోషులకూ మరణశిక్ష విధించడంపై హర్షం వ్యక్తంచేసింది. ‘‘మేం ఊపిరి బిగబట్టి ఎదురుచూశాం.. ఇప్పుడు ఉపశమనం కలిగింది. దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు’’ అని బాధితురాలి తల్లి స్పందించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad