ఈ నెల10న 'నిర్భయ' కేసులో తీర్పు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 04, 2013

ఈ నెల10న 'నిర్భయ' కేసులో తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో విచారణ ముగిసింది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌ లపై సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 10న న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో జునైనల్ కోర్టు ఇప్పటికే తొలి తీర్పు వెలువరించింది. నిర్భయ చట్ట ప్రకారం బాలనేరస్థుడికి మూడేళ్ల శిక్ష విధించింది. గత డిసెంబర్ 16 నాటి రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపైనా (ఈ యావత్ ఉదంతానికి ఇతనొక్కడే ప్రత్యక్ష సాక్షి) దాడి చేశారు. తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను కోర్టు విచారించింది. మరో నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్‌లో గత మార్చి 11న చనిపోయాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad