టాలీవుడ్ అందగాడు.. ప్రిన్స్ మహేష్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 12, 2013

టాలీవుడ్ అందగాడు.. ప్రిన్స్ మహేష్


హ్యాండ్ సమ్ హీరో... ప్రిన్స్ మహేష్ బాబు దేశంలో ఉన్న అత్యంత అందమైన 25 మంది అగ్రనటుల్లో టాప్ టెన్ లో నిలిచాడు. ఐఎమ్ డీబీ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ 6వ స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున 21వ స్థానం దక్కించుకున్నాడు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ధర్మేంద్ర, హృతిక్ రోషన్, వినోద్ ఖన్నా, దేవానంద్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 9, విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ 22, మమ్ముట్టి 25 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఈ లిస్టులో లేకపోవడం ట్విస్టు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, నాగార్జున మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad