రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచన చేయని పక్షంలో సికింద్రాబాద్ లోనే తాము మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. విభజన సమస్య రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించింది కాదని చెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ... ఇలా అన్ని వర్గాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అత్యున్నత విద్యా అవకాశాలు ఉన్న హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ఆయన అడిగారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లు భార్యభర్తల్లా తెలంగాణ సీమాంధ్ర కలిసి ఉన్నాయి. వారిద్దరికి పుట్టిన కొడుకే హైదరాబాద్. ప్రతిఫలం చేతికందే సమయంలో కొడుకు నా వాడే అంటే తండ్రి పరిస్థితేంటీ? అని ప్రశ్నించారు.
Post Top Ad
Sunday, September 08, 2013

సికింద్రాబాద్ లో మిలియన్ మార్చ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment