భాగ్యనగర్‌లో రేసుగుర్రం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 13, 2013

భాగ్యనగర్‌లో రేసుగుర్రం


కొన్ని టైటిల్స్ హీరోల ఇమేజ్‌కి టైలర్‌మేడ్‌లా అనిపిస్తాయి. అలాంటి టైటిలే ‘రేసుగుర్రం’. చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అల్లు అర్జున్‌కి సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. ఈ చిత్ర కథ, కథనాలు, బన్నీ పాత్ర చిత్రణ టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటాయని సమాచారం. ఇందులో బన్నీ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని వినికిడి. శ్రుతిహాసన్ ఇందులో కథానాయిక.

ఇప్పటికే ‘గబ్బర్‌సింగ్’, ‘ఎవడు’ చిత్రాలతో ఇద్దరు మెగా హీరోలనూ కవర్ చేసేసిన శ్రుతి... ఈ సినిమాలో బన్నీతో జతకట్టి మెగాహీరోలందరితో నటించిన క్రెడిట్ కొట్టేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఫిలింనగర్‌లో గల ఓ ప్రైవేటు భవంతిలో జరుగుతోంది. అక్కడ బన్నీ, ‘కిక్’శ్యామ్, జయప్రకాష్‌రెడ్డి, తనికెళ్ల  భరణి తదితరులపై దర్శకుడు సురేందర్‌రెడ్డి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నెల 17 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. సురేందర్‌రెడ్డి మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. సలోని, సుహాసినీ మణిరత్నం, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతమ్‌రాజు, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా ప్రొడక్షన్స్.

No comments:

Post a Comment

Post Bottom Ad