కుప్పకూలిన సిటీ లైట్ హోటల్: 17మంది దుర్మరణం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 09, 2013

కుప్పకూలిన సిటీ లైట్ హోటల్: 17మంది దుర్మరణం

సికింద్రాబాద్ రాణీగంజ్‌లో పురాతన భవనంలో నడుస్తున్న సిటీ లైట్ హోటల్ ఉదయం పూట ఉన్నట్టుండి కుప్పకూలింది. పలువురు దిన కూలీలు, హోటల్ పనివాళ్లతో పాటు మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. గాయాలపాలైన 21 మందిలో పలువురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.7.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఆపద్బంధు పథకం కింద రూ.లక్షతో పాటు జీహెచ్‌ఎంసీ ద్వారా కూడా మరో రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు. హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టడమే గాక ఘటనలో జీహెచ్‌ఎంసీ బాధ్యతరాహిత్యం ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని ఆదేశించారు. దుర్ఘటన నేపథ్యంలో, నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష జరిపారు.

మృతుల వివరాలు:
1. యు.రమేశ్ (28), తాడ్వాయి, నిజామాబాద్ జిల్లా. అడ్డా కూలీ
2. చత్రి దుర్గయ్య (45), ఇరుకోడ్, మెదక్. అడ్డా కూలీ
3. ఎం.రమేశ్ (38), పాన్‌బజార్, హైదరాబాద్. అడ్డా కూలీ
4. పి.ఎల్లయ్య (40), రామాయంపేట్, మెదక్. అడ్డా కూలీ
5. సయ్యద్ ముస్తఫా (35), హోటల్ యజమాని కుమారుడు
6. ఎం.బాలకృష్ణ (50), హైదరాబాద్. జీహెచ్‌ఎంసీ కార్మికుడు
7. సంతోష్ (25), ఒడిశా, హోటల్ వర్కర్
8. రాజీవ్ (28), ఒడిశా, హోటల్ వర్కర్
9. మనోజ్ (23), ఒడిశా, హోటల్ వర్కర్
10. ఎస్‌కే మీర్జా (21), ఒడిశా, హోటల్ వర్కర్

No comments:

Post a Comment

Post Bottom Ad