ఇద్దరమ్మాయిలతో..: రివ్యూ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 02, 2013

ఇద్దరమ్మాయిలతో..: రివ్యూ

పూరి జగన్నాథ్  అర్జున్ కలయికతో, దేవిశ్రీ ప్రసాద్ అధ్బుతమైన సంగీతంతో, స్టార్ ప్రోడ్యుసర్ బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన చిత్రం 'ఇద్దరమ్మాయిలతో..'. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనా
లు నెలకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే...

కేంద్రమంత్రి కూతురు ఆకాంక్ష (కేథరిన్ థెరిసా) చదువుకోడానికి యూరప్ వెళుతుంది. అక్కడ తాను ఉండే గదిలో ఆకాంక్షకు ఓ డైరీ దొరుకుంతుంది. ఏముందోననే ఆసక్తితో డైరీ చదవడం ప్రారంభిస్తుంది. సంగీతం నేర్చుకోవడానికి యూరప్ కి వచ్చిన కోమలి (అమలాపాల్)కి గిటారిస్ట్ సంజురెడ్డి(అల్లు అర్జున్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. పెద్దలు వారి పెళ్లికి పచ్చజెండా కూడా ఊపేస్తారు. కోమలిని చంపడానికి విలన్ గ్యాంగ్ వెంటాడుతుంటారు. విలన్ గ్యాంగ్ నుంచి కోమలిని సంజు రెండుసార్లు కాపాడుతాడు..మూడో ప్రయత్నంలో దాడి నుంచి కోమలిని కాపాడలేకపోతాడనేది ఆకాంక్షకు డైరీ ద్వారా తెలుస్తుంది. ఆతర్వాత ఏం జరిగిందోనని తెలుసుకునే క్రమంలో సంజూతో ఆకాంక్ష ప్రేమలో పడుతుంది. అయితే మూడవ సారి జరిగిన దాడిలో కోమలికి ఏం జరిగింది? సంజూ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? సంజూతో ఆకాంక్ష ప్రేమవ్యవహారం ఫలించిదా అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.


'ఇద్దరమ్మాయిలతో..' తరహా కథతో చాలా సినిమాలు వచ్చాయి. చాలా ఆర్డినరీ కథతో తొలి భాగంలో తన మార్కు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పూరి ప్రయత్నించాడు. తొలి భాగం తర్వాత ఏం జరుగనుందోననే ఆసక్తిని కొంత క్రియేట్ చేశాడు. అయితే రెండవ భాగంపై దర్శకుడి అదుపు పూర్తిగా తప్పినట్టు కనిపించింది.దాంతో ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. ఇక గతంలో మాదిరిగానే అల్లు అర్జున్ చాలా కష్టపడి ఈ సినిమాలో నటించారు. డాన్సుల్లో, ఫైటుల్లో బన్నీ తనదైన ముద్ర వేశారు. నటన పరంగా కూడా ‘ఓకే’ అనిపించారు. అమలాపాల్ చేయాల్సినదానికంటే కాస్త ఎక్కువ చేస్తే.. కేథరిన్ చేయాల్సిన దానికంటే కాస్త తక్కువ చేసి గ్లామర్ కే పరిమితమైంది.

రెండవ భాగంలో ఆలీ, బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులను విసిగించడం మొదలుపెట్టిన తర్వాత.. ఓ చిన్న టిస్ట్ తో సినిమాపై గ్రిప్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదట దేవిశ్రీప్రసాద్ సంగీతం.. దేవిశ్రీ పాటలు సూపర్బ్. పిక్చరైజేషన్ కూడా పూరీ ఫర్లేదనిపించారు. రెండవది కిచా ఫైట్స్. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఎపిసోడ్ హై రేంజ్ లో ఉంది. అమోల్ రాథోడ్ కెమెరా పనితీరు అద్బుతంగా ఉంది. మేకింగ్ పరంగా బండ్ల గణేశ్ రాజీలేని తనాన్ని మరోమారు రుజువు చేసిందీ సినిమా. ఆద్యంతం క్వాలిటీ వండర్ అనిపించింది. వీటన్నింటికి తోడు చిత్ర ద్వితీయ భాగంపై కొంత వర్కవుట్ చేస్తే గ్యారంటిగా మరో భారీ హిట్ పూరి, బన్నీల ఖాతాలో చేరి ఉండేది. కలెక్షన్ల పరంగా ఈ ఒపెనింగ్స్ భారీగా ఉండే అవకాశముంది. ఐతే యూత్, పూరి చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల స్పందన బట్టే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad