నాగచైతన్య, సునీల్ ‘తడాఖా’ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, May 11, 2013

నాగచైతన్య, సునీల్ ‘తడాఖా’

తారాగణం: నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా...
దర్శకత్వం: కిషోర్‌కుమార్
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు

తమిళంలో విజయవంతమైన ‘వెట్టై’ చిత్రానికి తెలుగు రీమేక్ రూ
పం ‘తడాఖా’. ‘100% లవ్’ చిత్రం తర్వాత నాగచైతన్య, తమన్నా నటించిన చిత్రం కావడం... సునీల్, నాగచైతన్య కలయికలో మల్టీస్టారర్ చిత్రంగా రావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ (డాలీ) ఈ ‘తడాఖా’కు దర్శకుడు. బెల్లంకొండ బ్యానర్, తమన్ సంగీతంతో రూపుదిద్దుకున్న తడాఖా చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా అనే విషయాన్ని పరిశీలిద్దాం!

శివరామకృష్ణ (సునీల్), కార్తీక్(నాగచైతన్య) అన్నదమ్ములు. వీరిద్దరూ పోలీసాఫీసర్ (నాగబాబు) కుమారులు. పెద్దోడు శివరామకృష్ణ అమాయకుడు.. పిరికివాడు.. అయితే పెద్దోడికి భిన్నంగా చిన్నోడు కార్తీక్ ధైర్యవంతుడు..తెలివైనవాడు. చిన్నవాడు ఎలాగోలా బతికేస్తాడు.. పెద్దవాడే జీవితంలో ఎలా నెగ్గుకొస్తాడనే బెంగ తండ్రికి ఉంటుంది. అయితే పెద్దోడికి కార్తీక్ ఎల్లవేళలా అండగా ఉంటూ.. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. తండ్రి ఆకస్మికంగా మరణించడంతో శివరామకృష్ణ పోలీసు ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. శివరామకృష్ణ ఉద్యోగంలో చేరిన పట్టణంలో బగ్గా, కాశి అనే రెండు స్మగ్లర్ గ్యాంగులుంటాయి. తమ్ముడి సహకారంతో ఆ గ్యాంగుల ఆట కట్టించే ప్రయత్నం చేస్తాడు. దాంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో శివరామకృష్ణకు మంచి పేరు రావడంతో ప్రత్యర్ధుల నుంచి ముప్పు ఎదురవుతుంది. ఈ క్రమంలో పిరికివాడిగా ఉన్న శివరామకృష్ణను ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్‌గా కార్తీక్ ఎలా మలిచాడు? వీరిద్దరూ కలిసి ప్రత్యర్థులను ఎలా తుద ముట్టించారనే ప్రశ్నలకు సమాధానమే తడాఖా చిత్రం!

అన్నకు ఎల్లవేళలా అండగా ఉంటూ హీరోయిజం ప్రదర్శించే కార్తీక్ పాత్రలో నాగచైతన్య తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పండించడంలో కొంత తడబాటుకు గురైనట్టు కనిపించాడు. అయితే యాక్షన్ సీన్లలో, తమన్నాతో కలిసి సాంగ్స్‌లో అదరగొట్టేశాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న పాత్రకు నాగచైతన్య న్యాయం చేకూర్చాడనడంలో సందేహం అక్కర్లేదు. తమన్నాతో చైతన్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. సునీల్ ఈ చిత్రంలో రెండు రకాల వేరియేషన్స్ ఉన్న శివరామకృష్ణ పాత్రలో కనిపించాడు. తొలి భాగంలో అమాయకుడిగా, పిరికివాడిగా కనిపించిన సునీల్.. రెండో భాగంలో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్‌గా రఫ్ఫాడించాడు. 

చిత్రం క్లైమాక్స్ లో సునీల్ నటన బ్రహ్మాండంగా వర్కవుటైనట్టు కనిపించింది. అయితే మల్టీ స్టారర్ చిత్రాల్లో ఉండే పాత్రల స్వభావం, పరిమితుల వల్ల సునీల్ పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చలేకపోయాడు. హీరోయిన్లు తమన్నా, ఆండ్రియా ఆటపాటలకే పరిమితమయ్యారు. తమన్నా అందచందాలు యువతను ఆకట్టుకునే విధంగా తెరపై కనిపించాయి. సునీల్ జోడీగా ఆండ్రియా కుదర్లేదు. ఇటీవల కాలంలో బ్రహ్మానందం కామెడినే ప్రధానంగా చేసుకుని చిత్రాలు రూపొందుతున్నాయి. అయితే ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ చాలా పేలవంగా ఉండటమే కాకుండా.. ప్రేక్షకులను విసిగించింది. వెన్నెల కిశోర్, శ్రీనివాస్‌రెడ్డిల హాస్యం అంతంత మాత్రమే. కిషోర్ కథను నడిపించిన తీరు సెకండాఫ్‌లో నెమ్మదించింది. తమన్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదనే చెప్పవచ్చు. విల్సన్ కెమెరా పనితనం ఓకే అనిపించింది. వేమారెడ్డి మాటలు అక్కడక్కడ పేలాయి. ఓవరాల్ గా యువత ఈ చిత్రాన్ని ఆదరించడంపైనే ‘తడాఖా’ విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.

No comments:

Post a Comment

Post Bottom Ad