రానా, సమంత సమ్‌థింగ్ సమ్‌థింగ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, May 11, 2013

రానా, సమంత సమ్‌థింగ్ సమ్‌థింగ్


తెలుగు పరిశ్రమలో మంచి మార్పు కనిపిస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలు జోరు అందుకుంటున్నాయి. అలాగే ఓ స్టార్ హీరో సినిమాలో మరో హీరో అతిథి పాత్ర చేయడం, హీరోయిన్లు కూడా ఈ తరహా పాత్రలు అంగీకరించడం జరుగుతోంది.

తారలు గీత దాటి బయటికొచ్చి.. ఇతరుల చిత్రాల్లో ఇలా గెస్టులుగా కనిపించడం ఆ సినిమాకి ఓ అదనపు ఆకర్షణ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సిద్ధార్ధ్, హన్సిక జంటగా రూపొందుతోన్న ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ చిత్రంలో అలాంటిదే జరుగుతోంది. ఈ చిత్రంలో రానా, సమంత అతిథి పాత్రలు చేయడానికి అంగీకరించారు.

ఈ ఇద్దరూ జంటగా కనిపించనున్నారా? వీరి పాత్రల నిడివి ఎంత? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. నటి ఖుష్బూ భర్త సుందర్ .సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రేపు హైదరాబాద్‌లో జరగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి.సుబ్రమణ్యం నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad