మే 9న అల్లు అర్జున్‌ ఇద్దరమ్మాయిలతో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 09, 2013

మే 9న అల్లు అర్జున్‌ ఇద్దరమ్మాయిలతో!


ఈ నెల మూడో వారంలో పాటలను, మే 9న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. నేడు బన్నీ పుట్టినరోజు. ఈ సందర్భంగా గణేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గబ్బర్‌సింగ్, బాద్‌షా తర్వాత మా సంస్థలో వస్తున్న సినిమా ఇది. బన్నీ నిర్మాతల శ్రేయస్సు ఆలోచించే బంగారంలాంటి హీరో. ఈ కథలో చాలా పొటెన్షియాల్టీ ఉంది.

బ్యాంకాక్‌లో ఇంటర్నేషనల్ ఫైట్‌మాస్టర్ కిచ్చా ఆధ్వర్యంలో తీసిన యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. బాలీవుడ్ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య నేతృత్వంలో స్పెయిన్‌లో తీసిన పాట ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేవిశ్రీప్రసాద్ ఎంతో శ్రద్ధతో మంచి పాటలిచ్చారు’’ అని గణేష్ తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad