బాబు అవినీతి గురించి పూసగుచ్చినట్లు వివరించిన సాక్షి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

బాబు అవినీతి గురించి పూసగుచ్చినట్లు వివరించిన సాక్షి!

babu-corruption
ఇసుక నుంచి ఇరిగేషన్‌ దాకా, మట్టి నుంచి మద్యం దాకా అన్ని రంగాలలో ఆకాశమెత్తున అవినీతి సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సాక్షి ఆరోపించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో రాజధాని భూములను కొల్లగొట్టారని, చివరకు గుడిభూములనూ, గుడిలో లింగాన్నీ కైంకర్యం చేస్తున్నారని పేర్కొంది. అలా సంపాదించిన అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా, ఆడియో వీడియో టేపుల్లో సాక్ష్యాలు బయటపడ్డా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ బాబు నెట్టుకొస్తున్నట్లు చెప్పింది.

సాక్షి వివరించిన బాబు బాగోతాల లిస్టు...
- నంద్యాలలో ఓటుకు ఆరువేల నుంచి ఎనిమిదివేల రూపాయలు పంచినా వీటికి పెద్దగా పట్టింపులేదు.
- అధికారంలోకి రాకముందు చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌రిటెయిల్‌ షేరు ధర రూ. 200 ఉండేది. బాబు అధికారంలోకి రాగానే అది మూడురెట్లు పెరిగి రూ. 900కు చేరుకుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు సరిగ్గా రెండు రోజులకు ముందు హెరిటేజ్‌ వాటాలను కార్పొరేట్‌ దిగ్గజ సంస్థ ‘ఫ్యూచర్‌ రిటెయిల్‌’కు విక్రయించేశారు. ఈ డీల్‌లో భాగంగా ఫ్యూచర్‌ రిటెయిల్‌లో హెరిటేజ్‌ సంస్థకు 3. 65 శాతం షేర్లు దక్కాయి. వాటి విలువ రూ. 295 కోట్లకు పైమాటే. ఆ నాటి మేలుకు ప్రతిఫలంగానా అన్నట్లు ఆ తర్వాత ‘చంద్రన్న విలేజ్‌మాల్స్‌’ వ్యాపారంలో ఫ్యూచర్‌ రిటెయిల్‌ సంస్థకూ చంద్రబాబు భాగం కల్పించడం తెల్సిందే. ఫ్యూచర్‌ సంస్థకు మేలు కల్పించడమంటే అందులో వాటాలున్న హెరిటేజ్‌కూ మేలు చేసుకోవడమేనని వేరే చెప్పాలా?
- కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తెలుగుదేశం నాయకుడు సుజనాచౌదరి మారిషస్‌ బ్యాంకు నుంచి రూ. 100 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టేశారు. ‘సుజనా యూనివర్సల్‌’ పేరుతో సుజనా చౌదరి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం లేదంటూ మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎంసీబీ) కేసులు పెట్టింది. న్యాయస్థానం నుంచి నోటీసులూ అందాయి. తెలుగుదేశం ప్రభుత్వం గానీ, పార్టీ గానీ దీనిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. కనీసం మాటమాత్రంగానైనా ఖండించనూ లేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad