ఏపీ ‘టెట్‌’-2017 షెడ్యూల్ విడుదల - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, December 14, 2017

ఏపీ ‘టెట్‌’-2017 షెడ్యూల్ విడుదల

TET-2017 Schedule Released
ఉపాధ్యాయ నియామకాల అర్హత పరీక్ష అయిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌) షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. టెట్‌ నోటిఫికేషన్‌ డిసెంబర్ 14న విడుదల కానుంది. పరీక్షలను జనవరి 17 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తామని మంత్రి గంటా వివరించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష అనంతరం ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీని) చేపడతామని వెల్లడించారు.ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)కి అప్పగిస్తామని వివరించారు. టెట్‌కు హాజరయ్యేందుకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని, అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ‘http://cse.ap.gov.in/’ద్వారా సమర్పించాలన్నారు. టెట్‌ షెడ్యూల్, ఇతర సమాచారాన్ని కూడా ఇదే వెబ్‌సైట్‌  ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు.

Read in English: TET-2017 Schedule Released

No comments:

Post a Comment

Post Bottom Ad